సెమీస్‌కు చేరకపోవడం నిరాశే: గేల్‌

5 Jul, 2019 23:24 IST|Sakshi

లీడ్స్‌: ప్రపంచకప్‌లో తమ జట్టు కనీసం సెమీస్‌కు కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించిందని వెస్టిండీస్‌ విధ్వంసక వీరుడు క్రిస్‌ గేల్‌ అన్నాడు. విండీస్‌ తరఫున రికార్డు స్థాయిలో ఐదు ప్రపంచకప్‌లు ఆడిన గేల్‌కు ఈ ప్రతిష్టాత్మక టోర్నీయే చివరిది. ఇందులో తొలి మ్యాచ్‌ గెలిచిన వెస్టిండీస్‌.. ఆ తర్వాత వరుసగా ఏడింట్లో ఓడి సెమీస్‌కు దూరమైంది. గురువారం ఆఫ్గనిస్థాన్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో మాత్రం 23 పరుగులతో గెలిచి విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ విండీస్‌కే కాదు ‘యూనివర్సల్‌ బాస్‌’ క్రిస్‌ గేల్‌కు కూడా ఆఖరిదే. ఇందులో బ్యాట్‌తో విఫలమైన గేల్‌(7).. బౌలింగ్‌లో మాత్రం 6 ఓవర్లు వేసి 28 పరుగులకు 1 వికెట్‌ తీశాడు. 

దీనిపై మ్యాచ్‌ అనంతరం గేల్‌ మీడియాతో మాట్లాడాడు. ‘ప్రపంచకప్‌లో ఐదుసార్లు వెస్టిండీస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. అయితే, ప్రస్తుత టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకపోవడం నిరాశ కలిగించింది’అని పేర్కొన్నాడు. ‘రెండేళ్ల విశ్రాంతి అనంతరం విండీస్‌ జట్టులోకి తిరిగి పునరాగమనం చేశా. ప్రపంచకప్‌ ట్రోఫీని ఎత్తుకొని మురిసిపోవాలనుకున్నా. అయితే, అది సాధ్యం కాలేదు. ఈ టోర్నీ ద్వారా విండీస్‌కు హెట్‌మైర్, పూరన్, హోప్‌ వంటి ప్రతిభావంతులు దొరికారు. వీరికి యువ సారథి హోల్డర్‌ తోడయ్యాడు. కచ్చితంగా విండీస్‌ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. స్వదేశంలో భారత్‌తో సిరీస్‌ తర్వాత కరేబియన్‌ ప్రీమియర్‌ లీడ్, కెనడా టీ20 సిరీస్‌ల్లో ఆడాలనుకుంటున్నా’అని వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

ఫైనల్లో పరాజితులు లేరు 

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు