నా విమాన ప్రయాణాన్ని అడ్డుకున్నారు: గేల్‌

5 Nov, 2019 13:42 IST|Sakshi

ఆంటిగ్వా: వెస్టిండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ ఒక ఎయిర్‌లైన్‌ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన విమాన ప్రయాణంలో  భాగంగా టికెట్‌ కన్‌ఫర్మ్‌ అయినప్పటికీ అనుమతించకపోవడాన్ని గేల్‌ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘ నేను విమాన టికెట్‌ను బుక్‌ చేసుకున్నా. అది కన్‌ఫర్మ్‌ అయ్యింది. కానీ నన్ను విమానంలో ప్రయాణించడానికి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ అనుమతించలేదు. ఓవర్‌ బుకింగ్‌ అయ్యిందంటూ సాకులు చెప్పారు. ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది నా జీవితంలో చేదు అనుభవం​’ అని గేల్‌ పేర్కొన్నాడు.

బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ తీసుకున్న తనను ఎకానమీ క్లాస్‌ ప్రయాణించేలా చూశారన్నాడు. దాన్ని తిరస్కరించి తదుపరి విమానంలో ప్రయాణించానని గేల్ ట్వీటర్‌లో పేర్కొన్నాడు. కాకపోతే ఎక్కడ్నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో గేల్‌కు ఈ పరిస్థితి ఎదురయ్యిందనే విషయం మాత్రం చెప్పలేదు.

ఇటీవల భారత్‌తో ఆగస్టులో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ తరఫున కనిపించిన గేల్‌.. 42 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో విండీస్‌పై భారత్‌ విజయం సాధించింది. కోహ్లి అద్భుతమైన సెంచరీ చేయడంతో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని వార్తలు