బిగ్‌బాష్‌లో గేల్ కొనసాగొచ్చు: సీఏ

24 Apr, 2016 01:07 IST|Sakshi
బిగ్‌బాష్‌లో గేల్ కొనసాగొచ్చు: సీఏ

మెల్‌బోర్న్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తమ బిగ్‌బాష్ టి20 లీగ్‌లో కొనసాగవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. గత సీజన్ సందర్భంగా గేల్ ఓ మహిళా రిపోర్టర్‌తో అనుచితంగా ప్రవర్తించడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. 10 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు.

సీఏ నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటామని, మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి అరోపణలు ఎదుర్కొనే ఆటగాడిని నిరోధించగలమని... ఇతరత్రా కారణాలతో నిషేధించలేమని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. బిగ్‌బాష్, దేశవాళీ క్రికెట్లో ఆడొద్దని ఎవరు పడితే వారు నిర్ణయించలేరని సదర్లాండ్ చెప్పారు. దీనిపై అతను ప్రాతినిధ్యం వహించే మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తేల్చాల్సి వుంటుందని ఆయన చెప్పారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు