ఇలా కూడా బ్యాటింగ్‌ చేస్తారా?

1 Nov, 2018 12:28 IST|Sakshi

కాన్‌బెర్రా: తమ టెక్నిక్‌ను మెరుగుపరుచుకునే క్రమంలో క్రికెటర్లు ఫుట్‌వర్క్‌ను సరిచేసుకోవడమనేది సాధారణ విషయమే. తన ఫుట్‌వర్క్‌ను గతం కంటే భిన్నంగా సవరించుకున్నఆసీస్‌ క్రికెటర్‌ జార్జ్‌ బెయిలీ ఇప్పుడు అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. ఇలా కూడా బ్యాటింగ్‌ చేస్తారా అనే చందంగా తన బ్యాటింగ్‌ శైలిని మార్చుకున్నాడు బెయిలీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం ప్రెసిడెంట్‌ ఎలెవన్‌-దక్షిణాఫ్రికాల మధ్య ఒక రోజు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రెసిడెంట్‌ ఎలెవన్‌కు బెయిలీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంచితే, ఇక్కడ తన బ్యాటింగ్‌ స్టైల్‌తో అందర్నీ అలరించాడు బెయిలీ.

కుడిచేత వాటం బ్యాట్స్‌మన్‌ అయిన బెయిలీ.. తన కుడి కాలిని లెగ్‌ వికెట్‌కు బాగా బయటకు చాపుతూ బ్యాటింగ్‌ చేయడం అభిమానుల్లో నవ్వులు పూయించింది. ప్రధానంగా పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేటప్పుడు బెయిలీ ఈ తరహాలో  బ్యాటింగ్‌ చేయడం ఆసక్తికరంగా మారింది.  ఈ మ్యాచ్‌లో అజేయంగా 51 పరుగులు చేసిన బెయిలీ.. ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ విజయంలోముఖ్య భూమిక పోషించాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 42 ఓవర్లలో 173 పరుగులు చేయగా, ఆపై ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ 36.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. బెయిలీ హాఫ్‌ సెంచరీకి తోడుగా జాస్‌ ఫిలిప్పి(57) అర్థ శతకం సాధించాడు.

                  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా