1 నుంచి జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్స్‌ బుకింగ్స్‌

26 Oct, 2017 10:46 IST|Sakshi

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లోని ఇండోర్, అవుట్‌డోర్‌ స్టేడియాలను వినియోగించుకోవడానికి, స్విమ్మింగ్‌పూల్స్, ప్లే గ్రౌండ్‌లలో సభ్యత్వం కోసం ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌ రెడ్డి తెలిపారు. ‘పే అండ్‌ ప్లే’ కేటగిరీలో నగరంలోని 21 క్రీడా మైదానాలు, 13 స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. వీటితో పాటు 14 ఇండోర్‌ స్టేడియాలు, 9 అవుట్‌డోర్‌ స్టేడియాలు, 10 స్విమ్మింగ్‌పూల్స్‌లలో సభ్యత్వం కోసం కేవలం ఆన్‌లైన్‌లోనే సంప్రదించాలని కోరారు. వేదికల వద్ద ఎలాంటి లావాదేవీలు ఉండవన్నారు. కార్పొరేట్‌ కేటగిరీలో 21 ప్లేగ్రౌండ్‌లు, ప్రైవేట్‌ పాఠశాలల అవసరాల కోసం 521 క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నాయని కమిషనర్‌ వివరించారు.

వీటికి సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు నవంబర్‌ 1 నుంచి మొదలవుతాయని చెప్పారు. నగరంలో సుమారు 7 వేలకు పైగా ప్రైవేట్‌ పాఠశాలలుండగా, అందులో 70 శాతం స్కూల్స్‌లో సరైన క్రీడా మైదానాలు లేవన్నారు. జీహెచ్‌ఎంసీ మైదానాలను, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను ఉదయం గం. 5–9, సాయంతం గం. 4–7 మధ్య క్రీడాకారులకు ఉచితంగా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖాళీగా ఉండే మైదానాలను పాఠశాలలు, కార్పొరేట్‌లకు గంటల వారీగా అద్దెకు కేటాయించాలని నిర్ణయించామన్నారు. కోచ్‌ల వివరాలు, సభ్యత్వ నమోదుకై జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ జ్టి్టhttp://www.ghmc. gov.in/rportrలో చూడవచ్చన్నారు.  

>
మరిన్ని వార్తలు