హాల్ ఆఫ్ ఫేమ్ లో గిల్ క్రిస్ట్ కు చోటు

25 Jan, 2015 11:21 IST|Sakshi
హాల్ ఆఫ్ ఫేమ్ లో గిల్ క్రిస్ట్ కు చోటు

సిడ్నీ:ఆసీస్ మాజీ క్రికెటర్, కెప్టెన్  ఆడమ్ గిల్ క్రిస్ట్ కు ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ -2015లో చోటు లభించింది. గిల్ క్రిస్ట్ తో పాటు, ఆసీస్ మాజీ కెప్టెన్, సెలెక్టర్ జాక్ రైడర్ కూడా హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు జనవరి 27వ తేదీన సిడ్నీలో జరిగే అలెన్ బోర్డర్ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమానికి గిల్ క్రిస్ట్, రైడర్ లు హాజరుకానున్నారు.

 

ఇందులో భాగంగానే వారిద్దరూ అలెన్ బోర్డర్  మెడల్ ను అందుకోనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. సెలెక్షన్ కమిటీ ఛాయిస్ లో భాగంగా ఈ సంవత్సరం ఆ ఇద్దరు మాజీ ఆటగాళ్లకు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించినట్లు చైర్మన్ డేవిడ్ క్రో తెలిపారు.

మరిన్ని వార్తలు