శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ

2 Feb, 2020 12:36 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ ‘ఎ’తో జరిగిన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌ను భారత్‌ ‘ఎ’ జట్టు డ్రాగా ముగించింది. ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే 346 పరుగుల వెనుకబడి ఉన్న సమయంలో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసింది. దాంతో భారత్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీతో అజేయం నిలిచి మ్యాచ్‌ను ఓడిపోకుండా కాపాడాడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్‌ 279 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 4 సిక్స్‌లు సాయంతో 204 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మూడో వికెట్‌కు ప్రియాంక్‌ పాంచల్‌(115)తో కలిసి 167 పరుగులు జత చేసిన గిల్‌.. అనంతరం హనుమ విహారి(100 నాటౌట్‌)తో కలిసి నాల్గో వికెట్‌కు అజేయంగా 222 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. గిల్‌ డబుల్‌ సెంచరీకి తోడు, హనమ విహారి, ప్రియాంక్‌ పాంచ్‌లు సెంచరీలు సాధించడంతో మ్యాచ్‌ను భారత్‌ కోల్పోకుండా కాపాడుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 216 పరుగులకు ఆలౌటైతే, కివీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 562/7 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. 

>
మరిన్ని వార్తలు