చెత్తకుండీలో ఒలింపిక్ గోల్డ్ మెడల్!

30 Aug, 2016 08:31 IST|Sakshi
చెత్తకుండీలో ఒలింపిక్ గోల్డ్ మెడల్!

ఒలింపిక్ గోల్డ్ మెడల్ పోయిందని బాధపడుతున్న ఆమెరికా అథ్లెట్ చెంతకు పతకం చేరడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ లో  రోయింగ్ విభాగంలో జో జాకోబి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే మాజీ ఒలింపియన్ జో జాకోబి గత జూన్ లో తన పతకం పోయిందని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తన కారులో నుంచి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని పతకాన్ని ఎవరో చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో అందరికీ ఆ విషయం తెలిసిపోయింది. ఇది జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత తండ్రితో కలిసి వెళ్తుండగా ఏడేళ్ల అట్లాంటా చిన్నారి కోల్ స్మిత్ ఓ చెత్తకుండీలో స్వర్ణ పతకాన్ని గుర్తించింది.



ఈ పతకం జకోబి పతకం అని తండ్రీకూతుళ్లు నిర్ధారించుకున్నారు. అతడికి పతకాన్ని అందేలా చేశారు. చిన్నారి కోల్ స్మిత్ గురించి తెలుసుకుని ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆమెను అభినందించాడు. దీంతో ఆ స్కూలు యాజమాన్యంతో పాటు చిన్నారి స్నేహితులకు ఆమె చేసిన గొప్పపని గురించి తెలిసింది.  చిన్నారి కోల్ స్మిత్ కూడా స్వర్ణ పతకాన్ని చేతిలోకి తీసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా మళ్లీ తన వద్దకు చేరిన మెడల్ ను స్కూలు విద్యార్థులకు చూపించాడు. గొప్ప అథ్లెట్ తమ స్కూలుకు రావడంతో యాజయాన్యంతో పాటు విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

మరిన్ని వార్తలు