భారతీయ యువతితో మ్యాక్స్‌వెల్‌ నిశ్చితార్థం

18 Mar, 2020 09:59 IST|Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. భారత సంతతికి చెందిన ఫార్మసిస్ట్‌ విని రామన్‌తో అతడి నిశ్చితార్థం  భారతీయ సాంప్రదాయ శైలిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెల్‌బోర్న్‌ వేదికగా మారింది. మ్యాక్స్‌వెల్‌ తరఫు బంధువులు కూడా చీరకట్టు, కుర్తా, పైజామాలు ధరించి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కావడం విశేషం.

కాగా మ్యాక్స్‌వెల్‌ భారతయ యువతిని పెళ్లాడిన ఆసీస్‌ రెండో క్రికెటర్‌గా నిలవనున్నాడు. అంతకుముందు ఆసీస్‌ పేసర్‌ షాన్‌ టైట్‌ భారత్‌కు చెందిన యువతినే పెళ్లాడాడు. ఐపీఎల్‌ 2014 సమయంలో ఓ వేడుకలో పరిచయమైన మషూమ్‌ సింఘా షాన్‌ టైట్‌ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మ్యాక్స్‌వెల్‌కు భారత్‌లోనూ ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అతడి మెరుపులను అభిమానులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు