'మ్యాక్స్ వెల్ స్థానంపై భరోసా లేదు'

23 Mar, 2017 14:49 IST|Sakshi
'మ్యాక్స్ వెల్ స్థానంపై భరోసా లేదు'

ధర్మశాల: ఇటీవల భారత్ తో జరిగిన మూడో టెస్టులో తమ దేశ ఆటగాడు మ్యాక్స్ వెల్ శతకంతో ఆకట్టుకున్నప్పటికీ అతని స్థానంపై పూర్తి స్థాయి భరోసా లేదని అంటున్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. 'మ్యాక్స్ వెల్ ఒక స్సిన్ ఆల్ రౌండర్.  అయినప్పటికీ ఆసీస్ జట్టుకు మ్యాక్స్ వెల్ రెగ్యులర్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కాదు. ప్రధానంగా ఫాస్ట్ పిచ్ లపై ఆడేటప్పుడు మ్యాక్స్ వెల్ ఎంపిక అనేది అవసరం కాకపోవచ్చు. దాంతో మ్యాక్స్ వెల్ ఎంపికపై కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొగ్గు చూపే అవకాశం చాలా తక్కువ.ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్ తో జరిగే టెస్టు సిరీస్ లో  ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్ వెల్ ను ఎంపిక చేయడం అనుమానమే. ఒక స్పిన్ ఆల్ రౌండర్ కంటే కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కే స్మిత్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. దాంతో మ్యాక్స్ వెల్ స్థానంపై భరోసా లేదనే చెప్పాలి' అని క్లార్క్ పేర్కొన్నాడు. 

 

ఆసీస్ జట్టులో మ్యాక్స్ వెల్ కీలక ఆటగాడైనప్పటికీ, అతను ఆల్ రౌండర్ గా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.
 

మరిన్ని వార్తలు