'టీమిండియాను చూసి నేర్చుకుందాం'

4 Feb, 2017 12:28 IST|Sakshi
'టీమిండియాను చూసి నేర్చుకుందాం'

సిడ్నీ:త్వరలో భారత్ పర్యటనకు రాబోతున్న తమ జట్టు విజయం సాధించాలంటే ప్రధానంగా స్పిన్ను ఎదుర్కోవడంపై ఎక్కువ కసరత్తు చేయాలని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అభిప్రాయపడ్డాడు. ఉపఖండంలోని పిచ్ల్లో రాణించడం అంత సులభం కాదని, అక్కడ పిచ్లను అర్థం చేసుకుని ఆధిక్యం సాధించాలంటే విపరీతంగా శ్రమించక తప్పదన్నాడు. 'భారత్ లోని పిచ్లపై రాణించాలంటే స్పిన్  ను సమర్ధవంతంగా ఎదుర్కోవడమే మార్గం. ఆ స్పిన్ను ధీటుగా ఎదుర్కోవాలంటే భారత బ్యాట్స్మెన్లు ఎలా ఆడుతున్నారో్ చూసి నేర్చుకోవాలి. టీమిండియాను చూసి స్పిన్ ఆడటాన్ని నేర్చుకుందాం' అని మ్యాక్స్వెల్ తెలిపాడు.

 

భారత్ లోని పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని తాను కచ్చితంగా చెప్పాలేనన్నాడు. స్కోరు బోర్డుపై సాధ్యమైనన్ని ఎక్కువ పరుగుల్ని ఉంచాలంటే మాత్రం విపరీతంగా శ్రమించక తప్పదన్నాడు. ఒక్కసారి మన చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ ఆపై వెంటనే చేజారిపోవడం భారత్ పిచ్ల్లో  అనేకసార్లు జరిగిన విషయాన్ని మ్యాక్స్ వెల్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. భారత్ లో స్సిన్నర్ల నుంచి తమకు గట్టి పోటీ ఎదురుకానుందని ముందుగానే జోస్యం చెప్పిన మ్యాక్స్ వెల్..  అక్కడ స్సిన్ ను ఎదుర్కోవాలంటే భారత ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో తమ ఆటగాళ్లు గమనించాల్సిన అవసరం ఉందన్నాడు.

 

మరిన్ని వార్తలు