ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

20 Aug, 2019 20:32 IST|Sakshi

లీడ్స్‌ : ఇంగ్లండ్‌ యువ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌పై ఆస్ట్రేలియా లెజండరీ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘టెస్టుల్లో పదునైన పేస్‌తో పాటు కచ్చితత్వంతో బౌలింగ్‌ చేయాలి. అప్పుడే విజయం సాధిస్తాం. ఆర్చర్‌ ఆ పనిని చాలా సులువుగా చేస్తున్నాడు. అతడి బౌలింగ్‌ చాలా సహజసిద్దంగా ఉంటుంది.  ​ఆర్చర్‌ రనప్‌, క్రీజును వదిలే క్రమం అన్నీ ఎక్కువ స్ట్రెస్‌ లేకుండా చాలా సింపుల్‌గా ఉంటాయి. టాప్‌ పేస్‌తో లాంగ్‌ స్పెల్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. అదే విధంగా బౌలింగ్‌ వేగంలో చాలా వేరియేషన్స్‌ చూపిస్తున్నాడు. ఆర్చర్‌ పేస్‌ బౌలింగ్‌కు అనుభవం తోడైతే ఎన్నో రికార్డులు సృష్టిస్తాడు’అంటూ ఆర్చర్‌ను మెక్‌గ్రాత్‌ ఆకాశానికి ఎత్తాడు.  

ఇక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆర్చర్‌ అరంగేట్రం చేశాడు. అరంగేట్రపు తొలి టెస్టులోనే ఆర్చర్‌ రెచ్చిపోయాడు. బుల్లెట్‌ వంటి బంతులతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను గెలిపించినంత పనిచేశాడు. ఇక అదే మ్యాచ్‌లో ఆర్చర్‌ పదునైన బౌన్సర్‌కు ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ గాయపడ్డాడు. అయితే స్మిత్‌ గాయంతో విలవిల్లాడుతుంటే ఆర్చర్‌ ప్రవర్తించిన తీరుపై పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌, పలువురు ఆసీస్‌ మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మెక్‌గ్రాత్‌ ఆర్చర్‌ను ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా