పరుగుల రాణికి యువీ బర్త్‌డే విషెస్‌

27 Jun, 2020 17:16 IST|Sakshi

పరుగుల రాణి పీటీ ఉష జన్మదినం సందర్భంగా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నేడు 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజుజు ఆమెకు ట్విటర్‌ వేదికగా పుట్టనరోజలు శుభాకాంక్షలు తెలిపారు. ‘ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పరుగుల రాణిగా మన్నలందుకున్న పీటీ ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ పోరాట పటిమ, అద్భుతమైన విజయాలు చూస్తూ పెరిగాం. మీ స్ఫూర్తి మమ్మల్ని భారతీయులుగా గర్వించేలా చేసింది. యువతను ప్రోత్సహించడానికి మీరు అంకితభావంతో పనిచేస్తున్నారు. మీకు ఆయురారోగ్యాలు సిద్ధించాలి’అని యువీ ట్వీట్‌ చేశాడు.

‘లెజండ్‌, భారతీయ నిజమైన గోల్డె్‌ గర్ల్‌ పీటీ ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె ఇప్పటికీ క్రీడాభివృద్ధికి కృషి​ చేస్తున్నారు. ఆమెకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’అని కిరణ్‌ రిజుజు ట్విటర్‌లో పేర్కొన్నారు. దాంతోపాటు పీటీ ఉషతో ఉన్న ఫొటోలను పోస్టుకు జత చేశారు. కాగా, పీటీ ఉష 1979 నుంచి భారతదేశం తరపున అథ్లెటిక్స్‌లో పాల్గొని దేశానికి పలు అద్భుత విజయాలను అందించారు. 1986 సియోల్‌ ఆసియా క్రీడలు, 1982 ఢిల్లీ ఆసియా క్రీడలు, 1990 ఆసియాడ్‌లో పాల్గొని 4 బంగారు పతకాలు, 7 రజత పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో రిటైర్‌ అయిన ఉష భావి అథ్లెట్ల శిక్షణ కోసం ఉషా స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌ను నెలకొల్పి సేవలందిస్తున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా