మన 'తంగం' గోమతి

25 Apr, 2019 10:30 IST|Sakshi
విజేతలతో గోమతి మారిముత్తు (మధ్యలో)

ప్రశంసల వెల్లువ

బంగారు పతక విజేతకు సీఎం అభినందన

టీ.నగర్‌: ఆసియన్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన తిరుచ్చి గోమతి మారిముత్తుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దోహాలో జరుగుతున్న ఆసియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ 2019 పోటీలో 800 మీటర్ల పరుగుపందెంలో 2.02.70 సెకన్లలో చేరి బంగారు పతకాన్ని సాధించారు. పేదకుటుంబంలో జన్మించిన గోమతి మారిముత్తు సొంత ఊరు తిరుచ్చి సమీపానగల ముడికండం గ్రామం. తండ్రి మారిముత్తు, తల్లి రాజాత్తి వ్యవసాయ కూలిలు. వారి చివరి సంతానం గోమతి. చిన్ననాటి నుంచే తన కుమార్తెలు చదువు, ఆటల్లో రాణించాలన్నదే తండ్రి మారిముత్తు తపన.

గోమతి కృషి ఫలించింది
చిన్ననాటి నుంచి చేసిన కృషి ఫలించిందని గోమతి తల్లి రాజాత్తి బుధవారం సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి గోమతికి ఏదైనా సాధించాలన్న తపనతోనే ఉండేదని, ఈ కారణంగా ప్రస్తుతం ఆసియా స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిందన్నారు. ఇది తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుదంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం గోమతి మారిముత్తును అభినందించారు.

మరిన్ని వార్తలు