'సచిన్, కాంబ్లీల పరిస్థితిని చూడండి'

7 May, 2016 22:45 IST|Sakshi
'సచిన్, కాంబ్లీల పరిస్థితిని చూడండి'

పుణె: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ క్రికెట్ కెరీర్ అర్థాంతరంగా ముగిసి పోవడానికి అతనికి సరైన సహకారం లభించకపోవడమే కారణమని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. సచిన్తో పాటే క్రికెట్ కెరీర్ను ఆరంభించిన వినోద్ కాంబ్లీకి ఎటువంటి సహాకారం లేకపోవడంతో వెనుకబడిపోయాడన్నాడు.


'ఆ ఇద్దరూ ఆటగాళ్లలో టాలెంట్ కొదవలేదు. కానీ సచిన్ క్రికెట్ కెరీర్ 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగితే.. కాంబ్లీ కెరీర్ మాత్రం తొందరగానే ముగిసింది. దీని కారణం మాత్రం కచ్చితంగా వారు పెరిగిన పరిస్థితులే. సచిన్ కంటే భిన్నమైన పరిస్థితి కాంబ్లీది. అటు కుటుంబం నుంచి , ఇటు స్నేహితుల నుంచి కాంబ్లీ సరైన సహకారం అందలేదు. అందుచేత కాంబ్లీ క్రీడా జీవితం మరుగున పడిపోయింది. ఒక క్రీడాకారుడు ఎదగాలంటే  సరైన సహకారం అవసరం''అని కపిల్ పేర్కొన్నాడు. తల్లి దండ్రులకున్న అభిరుచుల్ని పిల్లల మీద బలవంతంగా రుద్ది ఒత్తిడిలోకి నెట్టవద్దని కపిల్  హితవు పలికాడు.  పిల్లల్ని గ్రౌండ్ కు తీసుకురావడం ఒకటే తల్లి దండ్రులు చేస్తే మిగతాది వారే నేర్చుకుంటారన్నాడు. దాంతో పాటు పిల్లలకు పూర్తి మద్దతు ఇస్తూ అన్ని రకాలుగా మద్దతివ్వాలని కపిల్ పేర్కొన్నాడు. అప్పుడే వారి టాలెంట్ పూర్తి స్థాయిలో  బయటకొస్తుందన్నాడు.

మరిన్ని వార్తలు