‘పంత్‌.. నీకిదే మంచి అవకాశం’

3 Aug, 2019 11:39 IST|Sakshi

లాడర్‌హిల్‌ (అమెరికా): వెస్టిండీస్‌ పర్యటనకు భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని గైర్హాజరీ కావడం యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తనలోని నైపుణ్యాన్ని మరింత బయటపెట్టడానికి మంచి అవకాశమని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ఫ్లోరిడాలో శనివారం వెస్టిండీస్‌తో తొలి టీ20కి టీమిండియా సన్నద్ధమైన తరుణంలో పంత్‌ను ప్రశంసించాడు కోహ్లి. ‘ రిషభ్‌ పంత్‌ ఒక నైపుణ్యమున్న ఆటగాడు. విండీస్‌ పర్యటనలో అతను సత్తాచాటడానికి ఇదొక మంచి తరుణం.

విండీస్‌ పర్యటన నుంచి ధోని తప్పుకోవడంతో పంత్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పంత్‌ ప్రతిభ గురించి ప్రత్యేకం చెప్పక్కర్లేదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడతాడనే టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. నిలకడైన ఆటతో విండీస్‌ పర్యటనను పంత్‌ ఉపయోగించుకోవాలనే మేము కోరుతున్నాం. ఎంఎస్‌ ధోని అనుభవం అనేది మాకు ఎప్పుడూ కీలకమే. ఇక హార్దిక్‌ పాండ్యా కూడా విశ్రాంతి తీసుకోవడంతో ఇది యువ క్రికెటర్లకు మంచి చాన్స్‌. వారి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారనే ఆశిస్తున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు