ఆ మిస్టరీ క్రికెటర్‌ ఎవరు?

1 Feb, 2020 13:25 IST|Sakshi

వెల్లింగ్టన్‌: టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చహల్‌ టీవీ పేరుతో ఎప్పుడూ అభిమానుల్ని పలకరిస్తూ ఉంటాడు చహల్‌. అయితే తాజాగా ఒక టిక్‌టాక్‌ వీడియో చేశాడు ఈ స్పిన్నర్‌. శనివారం ఉదయం చేసిన ఈ వీడియో ఇప్పుడు అభిమానులకు పరీక్షగా నిలిచింది. సదరు టిక్‌టాక్‌ వీడియో ముగ్గురు క్రికెటర‍్లు ఎవరు అనేది క్లియర్‌గా తెలుస్తుండగా, నాల్గో క్రికెటర్‌ ఎవరనేది ఫ్యాన్స్‌కు పజిల్‌గా మారింది. ఆ వీడియోలో చహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శివం దూబేలు క్యాప్‌లు లేకుండా డ్యాన్స్‌ చేస్తుంటే, నాల్గో క్రికెటర్‌ మాత్రం క్యాప్‌ పెట్టుకుని ముఖం కనిపించకుండా డ్యాన్స్‌ చేశాడు. (ఇక్కడ చదవండి: పంత్‌ తోపన్నారు.. మరి ఎందుకు తీసుకోరు?)

ఆ క్రికెటర్‌ ఎవరు అనేది రివీల్‌ చేయకపోవడంతో  ఇది ఎవరు అనేదే అభిమానుల మదిలో మెదిలో ప్రశ్న. దీనిపై రకరకాల పేర్లను చెబుతున్నారు నెటిజన్లు. ఒకరు రోహిత్‌ శర్మ అని పేర్కొనగా, మరొకరు రిషభ్‌ పంత్‌ అని చెబుతున్నారు. మరికొంతమంది కోహ్లి అని పేర్కొంటున్నారు. కొంతమంది కుల్దీప్‌ యాదవ్‌ అంటున్నారు. ఇలా అభిమానులు తమ సమాధానాలు చెబుతూనే రకరకాల మీమ్స్‌తో చహల్‌ పోస్ట్‌కు రిప్లై ఇస్తున్నారు. ఇంతకీ ఆ మిస్టరీ క్రికెటర్‌ ఎవరో కనుక్కోవడానికి మీరు కూడా ప్రయత్నించండి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీసీసీఐ విరాళం రూ. 51 కోట్లు

ఈ భార‌త క్రికెట‌ర్ రియ‌ల్ హీరో: ఐసీసీ

దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు... 

ఆటగాళ్లూ... మీ స్థానాలు భద్రం 

భారత షాట్‌పుట్‌ క్రీడాకారుడిపై నాలుగేళ్ల నిషేధం 

సినిమా

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌ 

అల్లు అర్జున్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త్రిష‌

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...