అక్షర్ పటేల్ 'ఆరే'శాడు!

26 Dec, 2015 20:26 IST|Sakshi
అక్షర్ పటేల్ 'ఆరే'శాడు!

ఆలూర్(కర్ణాటక):వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో  జరుగనున్న సిరీస్ లో టీమిండియా వన్డే జట్టులో స్థానం సంపాదించిన స్పిన్నర్ అక్షర్ పటేల్.. విజయ్ హజారే వన్డే ట్రోఫీ  సెమీ ఫైనల్లో చెలరేగిపోయాడు.  శనివారం ఇక్కడ కేఎస్సీఏ మైదానంలో తమిళనాడుతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో అక్షర్ పటేల్ ఆరు వికెట్లు సాధించి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అక్షర్ 10.0 ఓవర్లలో ఒక మేడిన్ సాయంతో 43 పరుగులిచ్చి పొదుపుగా  బౌలింగ్ చేశాడు. దీంతో గుజరాత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది.

 

తొలుత టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 248 పరుగులు చేసింది. గుజరాత్ ఆటగాళ్లలో కెప్టెన్ పార్థీవ్ పటేల్ (0) నిరాశపరిచినా, ప్రియాంక్ పాంచల్(25) ఫర్వాలేదనిపించాడు. అనంతర చిరాగ్ గాంధీ(71), జునేజా(74)లు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన తమిళనాడు 47.3 ఓవర్లలో 217 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. తమిళనాడు ఆటగాళ్లలో అభినవ్ ముకుంద్(104) , దినేశ్ కార్తీక్(41)లు జట్టును గెలిపించేందుకు చేసిన ప్రయత్నం వృథా ప్రయాసే అయ్యింది.

 

అంతకుముందు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గౌతం గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. దీంతో  సోమవారం జరిగే ఫైనల్ పోరులో ఢిల్లీ-గుజరాత్ లు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం

లెగ్‌ స్పిన్నర్లే కీలకం

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

రైనాకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

విరాట్‌ కోహ్లీ ఎవరు ?

ఇంకొక్కటే..

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్‌ కన్నుమూత

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

హరికృష్ణ నిష్క్రమణ

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

సెమీస్‌లో ఏకలవ్య, గ్రీన్‌ ఓక్స్‌ జట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి