టీమిండియాకు బ్రేకిచ్చిన పాండ్యా

26 Oct, 2016 15:35 IST|Sakshi
టీమిండియాకు బ్రేకిచ్చిన పాండ్యా

రాంచీ: భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫామ్ లోకి వచ్చాడు. భారత్ తో ప్రస్తుతం జరుగుతన్న పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలకు గురవుతున్న గప్టిల్ ఈ మ్యాచ్ లో కివీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో కివీస్ ఓపెనర్ గప్టిల్ హాఫ్ సెంచరీ(72, 11 ఫోర్లు) చేశాడు. గప్టిల్ వన్డే కెరీర్ లో ఇది 31వ హాఫ్ సెంచరీ. 25 ఓవర్లు ముగిసేసరికి కివీస్ వికెట్ నష్టపోయి 138 పరుగులు చేసి పటిస్ట స్థితిలో ఉన్న కివీస్ ను పాండ్యా దెబ్బతీశాడు. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికి ధోనీకి క్యాచ్ ఇచ్చి గప్టిల్ రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న కివీస్ కు ఓపెనర్లు గప్టిల్, లాథమ్ అద్బుత ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 15.3 ఓవర్లలో 96 పరుగులు చేసిన తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి లాథమ్(39) ఔటయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (16 నాటౌట్) తో, రాస్ టేలర్(0)  క్రీజులో ఉన్నాడు. తొలి 10 ఓవర్లలో 80 పరుగులు సాధించిన కివీస్, తర్వాతి 10 ఓవర్లలో వికెట్ నష్టపోయి 36 పరుగులు మాత్రమే చేయగలిగింది.

>
మరిన్ని వార్తలు