హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్‌

1 Jan, 2020 20:39 IST|Sakshi

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. న్యూఇయర్‌ సందర్భంగా విషెస్‌ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశారు. అయితే ఇప్పటివరకు షేర్‌ చేసిన ఫోటోల్లో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్‌ ఉండేది.. కానీ తాజా ఫోటోల్లో ఆ చిన్న కాస్తంత గ్యాప్‌ కూడా కనిపిండం లేదు. అంతేకాకుండా గుత్తా జ్వాలకు ఏకంగా విశాల్‌ ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉండటం విశేషం. 

ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు పెట్టిన నెటిజన్లు.. తాజా ఫోటోలతో పక్కా కన్ఫర్మ్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.  విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని ఓ నెటిజన్‌ విమర్శించాడు. అయితే ఈ జంట ఎంతో క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఉందంటూ మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. వేరువేరుగా విడిపోయి ఒకటి అవుతున్న జంట అంటూ మరో నెటిజన్‌ సరదాగా పేర్కొన్నాడు. 

ఇక హీరో విష్ణు విశాల్‌ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్‌ కూడా ఒక కారణమంటూ రూమర్స్‌ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా గతంలోనే కొట్టి పారేశారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు