జిమ్నాస్ట్ దీపకు కాంస్యం

4 Aug, 2015 01:38 IST|Sakshi
జిమ్నాస్ట్ దీపకు కాంస్యం

హిరోషిమా (జపాన్): ఆసియా సీనియర్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి దీపా కర్మాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. సోమవారం జరిగిన మహిళల వాల్ట్ విభాగంలో త్రిపురకు చెందిన దీపా 14.725 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. యాన్ వాంగ్ (చైనా-14.988 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... సెయి మియకావ (జపాన్-14.812 పాయింట్లు) రజత పతకాన్ని దక్కించుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా