క్వార్టర్స్‌లో హకీమ్, అపూర్వ

13 Aug, 2019 09:55 IST|Sakshi

క్యారమ్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: రణడే స్మారక క్యారమ్‌ టోర్నమెంట్‌లో నవీన్, ఎంఏ హకీమ్‌ నిలకడగా రాణిస్తున్నారు. కింగ్‌కోఠిలోని మహారాష్ట్ర మండల్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ పురుషుల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో హకీమ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) 20–6, 15–24, 18–10తో ఆర్‌డీ దినేశ్‌బాబు (ఏజీఏపీ)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో ఎస్‌. నవీన్‌ 25–16, 25–10తో అబ్దుల్‌ రెహమాన్‌ను ఓడించాడు. మహిళల విభాగంలో ఎస్‌. అపూర్వ (ఎల్‌ఐసీ), రమశ్రీ (పోస్టల్‌), జయశ్రీ (ఐఓసీఎల్‌) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో అపూర్వ 25–0, 25–0తో ఎ. గౌరి (వనిత)పై, రమశ్రీ 22–5, 22–0తో విజయలక్ష్మి (ఎన్‌ఎఫ్‌సీ)పై, జయశ్రీ 25–4, 25–0తో ఎస్‌పీ శ్వేతపై గెలుపొందారు. జూనియర్‌ బాలికల విభాగంలో శ్రేయస (వరంగల్‌), ఏడబ్ల్యూఏఎస్‌ఏకు చెందిన ప్లేయర్లు కె. సరస్వతి, సి. దీప్తి, కె. నవిత, జి. భార్గవి ప్రిక్వార్టర్స్‌లో గెలిచి ముందంజ వేశారు. శ్రేయస 25–0, 25–0తో సమన్య (డీపీఎస్‌)పై, సరస్వతి 25–0, 25–0తో శ్రీనిత్య (బిర్లా గర్ల్స్‌)పై, దీప్తి 11–14, 13–12, 23–0తో ప్రమీషా (వరంగల్‌)పై, నవిత 20–14, 18–9తో సాయి కీర్తన (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై, భార్గవి 17–9, 23–0తో శ్రీవల్లి (వీ–10)పై విజయం సాధించారు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌: నరేశ్‌ (ఏసీసీఏ) 25–18, 25–5తో కిరణ్‌కుమార్‌పై, వసీమ్‌ (ఏసీసీఏ) 18–16, 25–14తో షారు క్‌ ఖాన్‌పై, ఆదిత్య 25–19, 19–17తో ఉద య్‌ కుమార్‌ (ఏజీఏపీ)పై, అనిల్‌కుమార్‌ 25–14, 25–0తో రాజకిషోర్‌పై, శ్రీనివాస్‌ (ఐఓసీఎల్‌) 23–18, 25–6తో గోపీకృష్ణపై గెలిచారు.  
మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌: లక్ష్మి 23–9, 12–23, 25–6తో పద్మజపై, కార్తీక వర్ష (ఎన్‌ఏఎస్‌ఆర్‌) 25–5, 25–4తో ప్రమీషా (వరం గల్‌)పై, మాధవి 21–15, 21–5తో ఇందిరా ప్రియదర్శిని (డీబీఐటీ)పై, నందిని (ఏడ బ్ల్యూఏఎస్‌ఏ) 25–13, 23–12తో సునీత (డీఎల్‌ఆర్‌ఎల్‌)పై, మణి 25–14, 21–124, 23–7తో సుజాతపై విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు