హ్యాట్రిక్‌ వరల్డ్‌ టైటిల్‌కు స్వల్ప దూరంలో..

28 Oct, 2019 11:24 IST|Sakshi

మెక్సికో: మరోసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచేందుకు మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ స్వల్ప దూరంలో నిలిచాడు. 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా వరల్డ్‌చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ సాధించిన హామిల్టన్‌ హ్యాట్రిక్‌ టైటిల్‌ సాధించడానికి నాలుగు పాయింట్ల దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన మెక్సికో గ్రాండ్‌ ప్రి రేసులో హామిల్టన్‌  విజేతగా నిలవడంతో తన చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను కాపాడుకోవడానికి మరింత చేరువయ్యాడు.

మెక్సికో గ్రాండ్‌ ప్రి రేసును మూడో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్‌.. ప్రత్యర్థి రేసర్లను వెనక్కినెట్టుతూ టైటిల్‌ గెలుచుకున్నాడు. ఈ 71 ల్యాప్‌ల రేసును 1 గంటా 36 నిమిషాల 48. 904 సెకన్లలో పూర్తి చేసిన విజయం సాధించాడు. ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటల్‌ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, మెర్సిడెస్‌కు చెందిన బోటాస్‌ మూడో స్థానంలో నిలిచాడు. తాజా విజయంతో  25 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కు ఇది పదో విజయం. ఫలితంగా మొత్తం 363 పాయింట్లతో ముందుంజలో ఉన్నాడు. ఆపై తన జట్టుకే చెందిన బోటాస్‌ 289 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇది హామిల్టన్‌కు రెండో మెక్సికో గ్రాండ్‌ ప్రి టైటిల్‌ కాగా, కెరీర్‌లో 83వ టైటిల్‌. ఇక మెర్సిడెస్‌ జట్టుకు ఫార్ములావన్‌లో 100వ విజయం.  ఇక తదుపరి రేసు యునైటెడ్‌ స్టేట్స్‌ గ్రాండ్‌ ప్రిలో హామిల్టన్‌ ఎనిమిదో స్థానంలో నిలిచినా వరల్డ్‌ చాంపియన్‌గా నిలుస్తాడు. 2008, 2014, 2015ల్లో వరల్డ్‌చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌.. 2017,2018ల్లో కూడా చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఐదు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ గెలిచిన హామిల్టన్‌.. ఆరో చాంపియన్‌షిప్‌పై గెలిచాడు. ఇక వరల్డ్‌ కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌లో కూడా మెర్సిడెస్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాండీ స్టన్నింగ్‌ క్యాచ్‌.. ఇంకా ఎవరైనా ఉన్నారా?

జొకోవిచ్‌ భారీ విరాళం

నిద్రలేవగానే ఏడుపు ఆపుకోలేకపోయా

‘నరకం అంటే ఏమిటో చూశా’

అదే ధోనికి చివరి చాన్స్‌ కావొచ్చు..

సినిమా

కరోనా: క్వారంటైన్‌పై అగ్రహీరో వివరణ

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’

విశాల్‌ స్థానంలో శింబు..!

రామాయ‌ణ్ చూస్తున్నా.. మ‌రి మీరు?