కామెరాన్‌.. సూపర్‌మ్యాన్‌లా పట్టేశాడు..!

19 Nov, 2019 15:16 IST|Sakshi

మెల్‌బోర్న్‌:  మార్ష్‌ వన్డే కప్‌లో విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా పరుగు తేడాతో గెలిచింది. అత్యంత ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేయగా, విక్టోరియా ఐదు వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసి ఓటమి పాలైంది. విక్టోరియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ 119 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. మూడో వికెట్‌కు హ్యాండ్‌స్కాంబ్‌తో కలిసి 147 పరుగులు చేయడంతో విక్టోరియా గెలుస్తుందనే అనుకున్నారంతా.  అయితే హ్యాండ్‌ స్కాంబ్‌(87) ఔటే విక్టోరియా కొంపముచ్చింది.

విక్టోరియా ఇన్నింగ్స్‌లో భాగంగా 28 ఓవర్‌ను కేన్‌ రిచర్డ్‌సన్‌ వేశాడు. ఆ ఓవర్‌ ఐదో బంతిని హ్యాండ్‌ స్కాంబ్‌ మిడ్‌ ఆఫ్‌- ఎక్స్‌ ట్రా కవర్‌ మీదుగా షాట్‌ ఆడగా,  ఆ ఫీల్డింగ్‌ పొజిషన్‌లోనే కాస్త దూరంగా ఉన్న కామెరాన్‌ వాలెంటే అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరొగొట్టాడు. ఆ సమయంలో బంతి పైకి లేవగా పరుగెత్తుకుంటూ వెళ్లి గాల్గోనే డైవ్‌ కొట్టి మరీ ఒక్క చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో హ్యాండ్‌ స్కాంబ్‌ షాకయ్యాడు. అసాధ‍్యం అనుకున్న క్యాచ్‌ను కామెరాన్‌ సూపర్‌మ్యాన్‌లా ఎగిరి పట్టడంతో హ్యాండ్‌ స్కాంబ్‌ భారంగా పెవిలియన్‌ చేరుకున్నాడు. ఇది మ్యాచ్‌కు కీలక మలుపు. ఫలితంగా చివర వరకూ పోరాటం చేసిన విక్టోరియా పరుగు తేడాతో ఓడి పోవడంతో ఈ క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు