ఈ శతకం నాన్నకు అంకితం: విహారి

2 Sep, 2019 01:46 IST|Sakshi

కింగ్‌స్టన్‌: టెస్టుల్లో సాధించిన తొలి శతకాన్ని తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి ప్రకటించాడు. ఇదే సందర్భంలో తాను సెంచరీ చేసేందుకు సహకరించిన పేసర్‌ ఇషాంత్‌ శర్మకు కృతజ్ఞతలు తెలిపాడు. శనివారం ఆట ముగిశాక విహారి మాట్లాడుతూ... ‘ఇదో భావోద్వేగమైన రోజు. నాకు 12 ఏళ్లున్నప్పుడు మా నాన్న చనిపోయారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో నమోదు చేసే తొలి సెంచరీని ఆయనకు అంకితం ఇవ్వాలని అప్పుడే నేను నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా సంతోషించి ఉంటారు’ అని పేర్కొన్నాడు. తన ఇన్నింగ్స్‌ పట్ల ఆనందం వ్యక్తం చేసిన విహారి... ఇందులో ఇషాంత్‌ పాత్రను కొనియాడాడు. ఇషాంత్‌ అచ్చమైన బ్యాట్స్‌మన్‌లా ఆడాడని, బౌలర్లు ఏం చేస్తారో మాట్లాడుకుంటూ ఇన్నింగ్స్‌ కొనసాగించామని, అతడి అనుభవం ఉపయోగపడిందని విహారి అన్నాడు.

>
మరిన్ని వార్తలు