గిల్‌ గోల్డెన్‌ డక్‌.. విహారి సెంచరీ

14 Feb, 2020 10:28 IST|Sakshi

ఐదు పరుగులకే మూడు వికెట్లు

ఆదుకున్న పుజారా- విహారి జోడి

ఎనిమిది  వికెట్లలో నలుగురు డకౌట్లు

హామిల్టన్‌:  న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆడుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌లు నిరాశపరిస్తే, నాల్గో స్థానంలో దిగిన శుబ్‌మన్‌ గిల్‌ కూడా విఫలమయ్యాడు. పృథ్వీ షా నాలుగు బంతులు ఆడి డకౌటైతే, మయాంక్‌ అగర్వాల్‌ 13 బంతులు ఆడి పరుగు మాత్రమే చేశాడు. అటు తర్వాత గిల్‌ గోల్డెన్‌ డక్‌గా నిష్క్రమించాడు.  న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో భారత బ్యాటింగ్‌ను పృథ్వీషా- మయాంక్‌ అగర్వాల్‌లు ఆరంభించగా ఆదిలోనే షాక్‌ తగిలింది.

జట్టు ఖాతా తెరవకుండానే పృథ్వీ షా పెవిలియన్‌ చేరితే,  జట్టు స్కోరు ఐదు పరుగుల వద్ద ఉండగా మయాంక్‌, శుబ్‌మన్‌లు క్యూకట్టారు.  ఆ తరుణంలో ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన చతేశ్వర్‌ పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కాగా, అజింక్యా రహానే(18) వైఫల్యం చెందడంతో 38 పరుగుల వద్ద భారత్‌ నాల్గో వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో పుజారాకు జత కలిసిన హనుమ విహారి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 193 పరుగులు జత చేసిన తర్వాత పుజారా(93;211  బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) ఔట్‌ కాగా, కాసేపటికి విహారి(101 రిటైర్డ్‌హర్ట్‌;182 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అయితే విహారి శతకం సాధించిన తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆపై రిషభ్‌ పంత్‌(7) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైతే, సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు డకౌట్‌ అయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 9 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. భారత కోల్పోయిన వికెట్లలో కుగ్లీజిన్‌, ఇష్‌ సోథీలు తలో  మూడు వికెట్లు సాధించగా, గిబ్సన్‌ రెండు వికెట్లు తీయగా, నీషమ్‌కు వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు