రాయుడు పేరును పరిశీలించండి: వీహెచ్‌

19 Jul, 2019 15:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత క్రికెటర్‌ అంబటి రాయుడు ఉద్వేగంలో తీసుకున్న రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జట్టు ఎంపికలో అతని పేరును పరిశీలించాలని పేర్కొంటూ మాజీ ఎంపీ, భారత క్రికెట్‌ సమాఖ్య చైర్మన్‌ వి. హనుమంతరావు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కు లేఖ రాశారు. ప్రతిభావంతుడైన రాయుడులో ఇంకా చాలా ఆట మిగిలి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. నం. 4లో బ్యాటింగ్‌తో పాటు అవసరమైన సమయాల్లో వికెట్‌ కీపింగ్‌ కూడా చేయగల సామర్థ్యం రాయుడుకు ఉందన్నారు. ప్రపంచకప్‌ ఎంపికలో తనపై చూపించిన నిర్లక్ష్యం కారణంగా నొచ్చుకున్న రాయుడు భావోద్వేగంలో రిటైర్మెంట్‌ను ప్రకటించాడని, బీసీసీఐ చొరవ తీసుకొని రాయుడుకు మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు