హర్భజన్‌ అరుదైన ఘనత

23 Mar, 2019 21:08 IST|Sakshi

చెన్నై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యధిక క్యాట్‌ అండ్‌ బౌల్డ్‌లు సాధించిన ఘనతను భజ్జీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌-12 సీజన్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో భజ్జీ.. మొయిన్‌ అలీని రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేశాడు. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధిక క్యాట్‌ బౌల్డ్‌లు సాధించిన జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 11 క్యాట్‌ అండ్‌ బౌల్డ్‌లతో భజ్జీ టాప్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే డ్వేన్‌ బ్రేవో(10)ను భజ్జీ అధిగమించాడు.

ఈ జాబితాలో సునీల్‌ నరైన్‌(7), పొలార్డ్‌(6)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంచితే ఆర్సీబీతో మ్యాచ్‌లో తొలి మూడు వికెట్లను హర్భజన్‌ తన ఖాతాలో వేసుకోవడం మరో విశేషం. కోహ్లి(6), మొయిన్‌ అలీ(9), ఏబీ డివిలియర్స్‌(9)ల వికెట్లను హర్భజన్‌ సాధించాడు. హర్భజన్‌ సింగ్‌ విజృంభణతో ఆర్సీబీ బ్యాటింగ్‌లో తడబడింది. 53 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.


 

మరిన్ని వార్తలు