‘హిందూ-ముస్లిం లొల్లి.. ఆ జట్టును చూసి నేర్చుకోండి’

16 Jul, 2018 11:48 IST|Sakshi
హర్భజన్‌ సింగ్‌

టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ : దేశంలో నెలకొన్న హిందూ-ముస్లిం గొడవల పట్ల టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ గొడవలను పక్కన పెట్టి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన క్రొయేషియాను చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఫ్రాన్స్‌-క్రొయేషియా ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు బజ్జీ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశాడు.

‘కేవలం 50 లక్షల జనాభా ఉన్న క్రొయేషియా ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతోంది. కానీ 135 కోట్ల జనాభా గల మన దేశంలో మాత్రం హిందూ-ముస్లింలు అనుకుంటూ గొడవపడుతున్నాం’ అని ట్విటర్‌లో అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. ఇక ఫిఫా తుది సమరంలో సంచలనాల క్రొయేషియా పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా