సెలక్టర్ల నిర్ణయంపై భజ్జీ ఫైర్‌!

6 Sep, 2018 12:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో సిరీస్‌ను ఓడిపోవడానికి రవిచంద్రన్‌ అశ్వినే ప్రధాన కారణమంటూ విమర్శలు గుప్పించిన భారత సీనియర్‌ ఆఫ్‌ స‍్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. తాజాగా ఆసియా కప్‌కు సంబంధించి భారత జట్టు ఎంపికను ప్రశ్నించాడు. అసలు సెలక్టర్లు ఏ ప్రాతిపదికన ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. ఇక్కడ ఒక్కో ఆటగాడికి ఒక్కో నిబంధనను సెలక్టర్లు అవలంభిస్తున్నారంటూ విమర్శించాడు. ప్రధానంగా ఆసియా కప్‌కు ఎంపిక చేసిన జట్టులో మయాంక్‌ అగర్వాల్‌కు చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు.

‘ఆసియాకప్‌ జట్టులో మయాంక ఎక్కడ.  మయాంక్‌ భారీగా పరుగులు చేసిన తర్వాత కూడా జట్టులో చోటు దక్కలేదు. ఇక్కడ సెలక్టర్ల నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. నా వరకూ అయితే ఒ‍క్కో ఆటగాడికి ఒక్కో నిబంధనను అనుసరిస్తున్నారు’ అని భజ్జీ మండిపడ్డాడు.

టీమిండియా ఓటమికి కారణం అతడే: భజ్జీ

>
మరిన్ని వార్తలు