హర్భజన్‌సింగ్‌పై నెటిజన్ల విమర్శలు...

10 Oct, 2017 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌పై నెటిజన్లు ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. పంజాబీలో పెళ్లైన మహిళలు పవిత్రంగా జరుపుకునే ‘కర్వా చౌత్’  పండుగ సందర్భంగా బజ్జీ తన భార్యకు విషేస్‌ తెలియజేస్తూ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో దుమారం లేపింది. కర్వా చౌత్‌ శుభాకాంక్షలు గీతా బస్రా. నేను బానే ఉన్నా..  ఆకలిగా ఉంటుంది తినండి’ అని భార్య ఫోటోతో బజ్జీ పోస్టు చేశాడు.

దీనిపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్‌లు చేశారు. ఈ మూడనమ్మకాన్ని పంజాబీలు ఇంకా పాటించడం బాధగా ఉంది. సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్‌లో ఇది ఒక మూఢాచారమని ఒకరు కామెంట్‌ చేయగా.. బజ్జీ సిక్కిసమ్‌ను బోధిస్తున్నాడని విమర్శించారు. ఈ ట్వీట్‌లపై మరికొందరు బజ్జీకి మద్దతుగా నిలిచారు. పంజాబీల గురించి మీకు అవగాహనలేకుంటే మాట్లాడకండి అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు ఓ బజ్జీ అభిమాని. ఇక హర్భజన్‌ కూడా నెటిజన్లకు ‘మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించకండి. మంచిగా ఉండటమే అతి పెద్ద మతమని’ స్ట్రాంగ్‌ రిప్లే ఇచ్చాడు.   

కార్తీక పౌర్ణమి తరవాత నాలుగవ రోజున ఈ కర్వా చౌత్ పర్వదినాన్ని ఉత్తరాది మహిళలు జరుపుకుంటారు. తమ భర్తలు ఆయు, ఆరోగ్యాల కోసం ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేసి, సాయంత్రం చంద్రుడికి పూజ చేసి, చంద్రోదయం తర్వాత జల్లెడ చాటున భర్తను చూస్తారు. ఇలా చేయడం వలన తమ భర్త ఆయు, ఆరోగ్యాలతో ఉంటారని వారి విశ్వాసం. తమ భర్తను జల్లెడ చాటున చూసిన తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.

మరిన్ని వార్తలు