‘మనకోసం మరో వైరస్‌ను సిద్ధం చేశారు’

30 Jun, 2020 17:23 IST|Sakshi

చైనాపై హర్భజన్‌ సింగ్ మరోసారి‌ ఆగ్రహం

హైదరాబాద్‌: టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా చైనా దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా మమహ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి కుట్ర కచ్చితంగా చైనా కుట్రేనని తేల్చిచెప్పిన భజ్జీ ఆ దేశ వస్తువులు బహిష్కరించాలని దేశ ప్రజలకు గతంలో పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డ్రాగన్‌ కంట్రీలో మరో వైరస్‌ పురుడు పోసుకుంటుందన్న వార్తలపై భజ్జీ స్పందించాడు. (వాటే ప్లాన్‌ చైనా: భజ్జీ)

పందుల్లో స్వైన్ ఫ్లూ వంటి మరో రకం వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిపిన రాయిటర్స్ కథనాన్ని రీట్వీట్ భజ్జీ రీట్వీట్‌ చేశాడు. ‘కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతుంటే వాళ్లేమో మన కోసం మరో వైరస్‌ సిద్ధం చేశారు’ అంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా కోపంతో ఉండే ఎమోజీలను జతచేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆధిపత్యం కోసం చైనా ఎంత నీచానికైనా దిగజారుతుందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. (‘భజ్జీపై నిషేధం వద్దని ఏడుస్తూ వేడుకున్నా’) 

కాగా మరో కొత్త రకం స్వైన్‌ ఫ్లూ వైరస్‌ ఒకటి ప్రస్తుతం చైనాను కలవరపెడుతోంది. ఇది‌ గతంలో విస్తరించిన స్వైన్‌ ఫ్లూ వైరస్‌ కంటే ఎంతో ప్రమాదకరమైనదని.. అంటువ్యాధిగా మారే లక్షణాలు కలిగి ఉందని అమెరికా సైన్స్ జర్నల్ పీఎన్‌ఏఎస్‌ సోమవారం ప్రచురించింది. జీ4 అని పిలువబడే ఇది జన్యుపరంగా 2009లో స్వైన్‌ ఫ్లూకు కారణమైన హెచ్‌1ఎన్‌1 జాతి నుంచి వచ్చిందని నివేదిక వెల్లడించింది. ఇది మానవులకు సోకడానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉందని చైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. (‘కరోనా చాలా నేర్పింది.. వ్యవసాయం చేస్తా’)

మరిన్ని వార్తలు