హార్దిక్‌-కృనాల్‌ల ‘తొలి’ ఇంటర్వ్యూ చూశారా?

6 Jul, 2020 10:58 IST|Sakshi

యంగ్‌ కిడ్స్‌ విత్‌ బిగ్‌ డ్రీమ్స్‌

ముంబై: భారత క్రికెట్‌ జట్టులో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగుతుండగా, అతని సోదరుడు కృనాల్‌ పాండ్యా మాత్రం అడపా దడపా అవకాశాలకే పరిమితం అవుతున్నాడు. హార్దిక్‌ పాండ్యా తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగితే, కృనాల్‌ మాత్రం ఇంకా ‘ఎదిగే’ దశలోనే ఉన్నాడు. గతేడాది వెన్నుగాయానికి శస్త్ర చికిత్స తీసుకుని సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న హార్దిక్‌.. ఇక రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దేశవాళీ లీగ్‌లో హార్దిక్‌ తన చాటుకుని పునరాగమనానికి సిద్ధమయ్యాడు.(‘ఐపీఎల్‌తో పెద్దగా ఒరిగిందేమీ లేదు’)

కృనాల్‌ మాత్రం ఒక పెద్ద సక్సెస్‌ కోసం ఇంకా చూస్తునే ఉన్నాడు. ప్రధానంగా టీ20లకే పరిమితమవుతున్న కృనాల్‌ పూర్తిస్థాయి ఆటగాడిగా రూపాంతరం చెందేందుకు కసరత్తలు చేస్తున్నాడు. కాగా, ఈ ఇద్దరు అన్న దమ్ములు కలిసి ఇచ్చిన ఒకనాటి ఇంటర్వ్యూను కృనాల్‌ ట్వీటర్‌ వేదికగా పంచుకున్నాడు. బరోడాకు రంజీ ట్రోఫీ ఆడిన తొలినాటి ఇంటర్వ్యూను పోస్ట్‌ చేశాడు. దీనికి హార్దిక్‌ స్పందిస్తూ ‘ ఇప్పుడు నిన్ను ఇలా చూడటం గోల్డ్‌ బ్రో’ అని కామెంట్‌ చేశాడు. ఇక తామిద్దరం ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ ఇదే నని కృనాల్‌ తెలిపాడు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు రావడం చాలా అరుదు. కాగా,  యువ క్రికెటర్లగా ఉన‍్నప్పుడు వారిచ్చిన ఇంటర్వ్యూను చూసుకుంటే ‘యంగ్‌ కిడ్స్‌ విత్‌ బిగ్‌ డ్రీమ్స్‌’ అనక తప్పదు.

ఇప్పటివరకూ 11 టెస్టు మ్యాచ్‌లు హార్దిక్‌ ఆడగా 73కు పైగా స్టైక్‌ రేట్‌తో 532 పరుగులు చేశాడు. ఇందులో అతని యావరేజ్‌ 31.29.  టెస్టుల్లో హార్దిక్‌ అత్యధిక స్కోరు 108. ఇక వన్డేలకు వచ్చేసరికి 54 మ్యాచ్‌లు ఆడి 957 పరుగులు చేశాడు. సుమారు 30 యావరేజ్‌, 115.57 స్టైక్‌ రేట్‌ కల్గి ఉన్నాడు హార్దిక్‌. వన్డేల్లో హార్దిక్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు 83.  40 అంతర్జాతీయ టీ20లు ఆడిన హార్దిక్‌ 310 పరుగులు చేసినా స్టైక్‌రేట్‌ పరంగా 147.61తో ఉన్నాడు. టెస్టుల్లో 17 వికెట్లు, వన్డేల్లో 54 వికెట్లు, అంతర్జాతీయ టీ20ల్లో 38 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో కృనాల్‌ 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా 121 పరుగులు చేశాడు. ఇక్కడ అతని స్టైక్‌రేట్‌ 131పైగా ఉంది. వికెట్ల పరంగా 14 వికెట్లను కృనాల్‌ సాధించాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు