తొలుత బేబీ స్టెప్స్‌.. ఆ తర్వాత వీల్‌చైర్‌లో

9 Oct, 2019 09:43 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సోషల్‌మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే విషయం తెలిసిందే. తనకు సంబంధించిన, నచ్చిన ఫోటో, వీడియోలను ఎప్పటికప్పుడూ షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. అయితే లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గత కొద్ది రోజుల క్రితమే తన శస్త్ర చికిత్స పూర్తయిందని, త్వరలోనే కోలుకొని మైదానంలో అడుగుపెడతానని ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొంటూ ఓ వీడియోను షేర్‌ చేశాడు.

నెమ్మదిగా నడవడం ప్రారంభించిన హార్దిక్‌.. అనంతరం వీల్‌చైర్‌లో కాసేపు తిరిగినది ఆ వీడియోలో ఉంది. ‘పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి బేబీ స్టెప్స్‌తో నా ప్రయాణం ప్రారంభించాను. త్వరలోనే మైదానంలో అడుగుపెడతా. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’అంటూ హార్టిక్‌ ఓ వీడియోను జత చేసి పోస్ట్‌ చేశాడు. దీంతో హార్దిక్‌ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ప్రార్ధిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఆసియా కప్‌ నుంచి హార్దిక్‌ వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆసియా కప్‌లో ఓ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తూ వెన్ను నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోవడంతో స్ట్రెచర్‌పై తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం తాజాగా మళ్లీ ఆ గాయం తిరగబెట్టడంతో శస్త్రచికిత్స తప్పనిసరని వైద్యులు తెలిపారు. దీంతో హార్దిక్‌ లండన్‌లో  శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా