అప్పటివరకు విశ్రాంతి తీసుకోను: హార్దిక్‌

20 May, 2019 11:48 IST|Sakshi

హైదరాబాద్‌: దేశం తరుపున ప్రపంచకప్‌ ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్‌ కోరుకుంటాడు. దాని కోసం ఎంతవరకైనా, ఎందాకైనా కష్టపడతారు. ప్రస్తుతం టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడుతున్నాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఆటగాళ్లను విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ సూచించింది. దీంతో ఇప్పటికే విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు తమ కుటుంబసభ్యులతో విహారయాత్రలకు వెళ్లి సేద తీరుతున్నారు. కానీ హార్దిక్‌ పాండ్యా మాత్రం నా రూటే సపరేట్‌ అంటూ జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు.
 జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను హార్దిక్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘ప్రపంచకప్‌ దగ్గర్లోనే ఉండటంతో విశ్రాంతి తీసుకోవడం లేదు’అనే కామెంట్‌తో ఆ వీడియోను పోస్ట్‌ చేశాడు. హార్దిక్‌ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో వివాదం తర్వాత హార్దిక్‌లో చాలా పరిణితి వచ్చిందని, ఐపీఎల్‌లో అతడి ఆట, నడవడికలో చాలా మార్పు వచ్చిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్‌ వేదికగా మే30 నుంచి క్రికెట్‌ విశ్వసమరం ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌లో ఈ సారి హాట్‌ఫేవరేట్‌ బరిలోకి దిగుతున్న టీమిండియాలో హార్దిక్‌ పాండ్యా కీలకఆటగాడు. ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పాండ్యా ప్రపంచకప్‌లోనూ అలాంటి ప్రదర్శనే చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
జిమ్‌లో కసరత్తులు చేస్తున్న హార్దిక్‌

మరిన్ని వార్తలు