రెండో రౌండ్‌లో హారిక

6 Nov, 2018 01:26 IST|Sakshi

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): తాడో పేడో తేల్చే టైబ్రేక్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మెరిసింది. ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. సోపికో ఖుఖాష్‌విలి (జార్జియా)తో జరిగిన తొలి రౌండ్‌లో హారిక 2.5–1.5తో విజయం సాధించింది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో... సోమవారం విజేతను నిర్ణయించేందుకు రెండు టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు.

తొలి గేమ్‌ను 57 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హారిక రెండో గేమ్‌లో మాత్రం 72 ఎత్తుల్లో గెలిచి రెండో రౌండ్‌ బెర్త్‌ను దక్కించుకుంది. భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ మాత్రం 1.5–2.5తో జన్‌సాయా అబ్దుమలిక్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయింది. టైబ్రేక్‌లోని తొలి గేమ్‌ను 69 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించిన పద్మిని... రెండో గేమ్‌లో మాత్రం 60 ఎత్తుల్లో ఓడిపోయింది. నేడు జరిగే రెండో రౌండ్‌ తొలి గేమ్‌లో జొలాంటా జవద్జా్క (పోలాండ్‌)తో కోనేరు హంపి; బేలా ఖొటెనాష్‌విలి (జార్జియా)తో హారిక తలపడతారు.    

మరిన్ని వార్తలు