హరికృష్ణ ముందంజ 

12 Sep, 2019 03:11 IST|Sakshi

నిహాల్, ఆధిబన్, విదిత్‌ కూడా  

ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): వరుసగా రెండో గేమ్‌లోనూ విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ 19వ ర్యాంకర్‌ పెంటేల హరికృష్ణ ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. విడాల్‌ యురీ గొంజాలెజ్‌ (క్యూబా)తో బుధవారం జరిగిన తొలి రౌండ్‌ రెండో గేమ్‌లో హరికృష్ణ 42 ఎత్తుల్లో గెలిచాడు. ఓవరాల్‌గా 2–0తో నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. భారత్‌కే చెందిన ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు నిహాల్‌ సరీన్, ఆధిబన్, విదిత్‌ కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. నిహాల్‌ 2–0తో జార్జి కోరి (పెరూ)పై, ఆధిబన్‌ 1.5–0.5తో బొనెల్లి (వెనిజులా)పై, విదిత్‌ సంతోష్‌ గుజరాతి 1.5–0.5తో అలన్‌ పిచోట్‌ (అర్జెంటీనా)పై విజయం సాధించారు. భారత్‌కే చెందిన సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, సునీల్‌దత్‌ నారాయణన్, మురళీ కార్తికేయన్, అరవింద్‌ చిదంబరం, అభిజిత్‌ గుప్తా నేడు టైబ్రేక్‌ గేమ్‌లు ఆడనున్నారు. 

మరిన్ని వార్తలు