హరికృష్ణకు రెండో స్థానం

21 Jul, 2020 01:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో భాగంగా జరిగిన ర్యాపిడ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్‌ ప్లేయర్‌ పెంటేల హరికృష్ణ రెండో స్థానాన్ని సంపాదించాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణ ఐదు పాయింట్లు స్కోరు చేశాడు. ఆరు పాయింట్లతో వొజ్తాసెక్‌ (పోలాండ్‌) విజేతగా నిలిచాడు. ర్యాపిడ్‌ విభాగంలో హరికృష్ణ మూడు గేముల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు.  నేటి నుంచి క్లాసికల్‌ విభాగంలో మరో టోర్నీ మొదలుకానుంది. 

మరిన్ని వార్తలు