హర్మన్‌ప్రీత్‌ నాయకత్వంలోనే...

13 Jan, 2020 03:30 IST|Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌ బరిలో భారత జట్టు

కొత్తగా రిచా ఘోష్‌కు స్థానం

హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి చోటు పదిలం  

ముంబై: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు స్టార్‌ క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహిస్తుంది. స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో బెంగాల్‌ అమ్మాయి రిచా ఘోష్‌కు తొలిసారి స్థానం లభించింది. హైదరాబాద్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. విండీస్‌ ఆతిథ్యమిచి్చన 2018 టి20 ప్రపంచకప్‌లోనూ అరుంధతి రెడ్డి భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. హరియాణాకు చెందిన 15 ఏళ్ల టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ తొలి వరల్డ్‌ కప్‌ ఆడనుంది. ఇటీవల జరిగిన చాలెంజర్‌ టోర్నీలో రిచా ఘోష్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో సెలక్టర్లు ఆమెను తొలిసారి జాతీయ జట్టులో ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు ముందు ఆ్రస్టేలియాలోనే జరిగే మూడు దేశాల టోర్నీలో పాల్గొనే జట్టులో 16వ సభ్యురాలిగా నుజత్‌ పరీ్వన్‌ను చేర్చారు.  

టి20 ప్రపంచకప్‌కు భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెపె్టన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెపె్టన్‌), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్‌ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనమ్‌ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి.   

మరిన్ని వార్తలు