జస్ట్‌.. ఇది ఆరంభమే : హర్మన్‌ ప్రీత్‌

10 Nov, 2018 08:56 IST|Sakshi
హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌

ప్రొవిడెన్స్‌ (గయానా): మహిళల టీ20 ప్రపంచకప్‌లో హరికేన్‌ తుఫాన్‌లా విరుచుకుపడిన టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ జస్ట్‌ ఇది ఆరంభం మాత్రమే అంటోంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (51 బంతుల్లో 103; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్‌ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు) సత్తా చాటడంతో భారత్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. (చదవండి: హర్మన్‌  హరికేన్‌)
 

ఈ మ్యాచ్‌ అనంతరం హర్మన్‌ ప్రీత్‌ మాట్లాడుతూ.. ‘చాలా ఆనందంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. మేం ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాలి. జట్టుగా కూడా మేం ఇంకా చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. నేను క్రీజులో సెట్టైతే.. షాట్స్‌ ఆడగలను. జెమీమా అద్భుతంగా ఆడింది. ఎవరైనా హిట్టింగ్‌ చేస్తే.. ఒకరు స్ట్రైక్‌ రొటేట్‌ చేయాలి. ఆ బాధ్యతను జెమీమా తీసుకుంది. ఈ క్రెడిట్‌ అంతా ఆమెదే. జెమీమా చాలా మెచ్యూర్‌. ఇక బౌలింగ్‌ విభాగంలో మేం కొంత మెరుగవ్వాలి. ముఖ్యంగా తొలి ఆరు ఓవర్లలో మా బౌలింగ్‌ చాలా పుంజుకోవాలి.’అని అభిప్రాయపడింది. (చదవండి: కౌర్‌ పవర్‌! )

హెడ్‌కోచ్‌ రమేశ్‌ పవార్‌ పూర్తిగా తమ ఆలోచనా విధానాన్ని మార్చేసాడని, ఇది తమకెంతో ఉపయోగపడిందని, ఆయన తమ జట్టులో  భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. భారత సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ తమ జట్టుకు కీలకమని, తొలి ఆరు ఓవర్లలో ఆమె అంతగా పరుగులు చేయలేదని,  ఆ తరువాత బ్యాటింగ్‌ చేస్తే ఆమె రాణించగలదని హర్మన్‌ అభిప్రాయపడింది. హర్మన్‌-జెమీమా నాలుగో వికెట్‌కు అత్యధికంగా 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్‌ హర్మన్‌ బౌండరీలతో బిజీగా ఉండగా.. జెమీమా స్ట్రైక్‌ రోటెట్‌ చేసింది. ఇదే హర్మన్‌ ఆకట్టుకుంది. దీంతో జెమీమాను ఆకాశానికెత్తింది. (చదవండి: హర్మన్‌ సేన ఏం చేస్తుందో?)

మరిన్ని వార్తలు