అనుష్కతో బ్రేకప్ను ఇలా చెప్పాడా?

12 Apr, 2016 15:19 IST|Sakshi
అనుష్కతో బ్రేకప్ను ఇలా చెప్పాడా?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే పాపులర్ అయ్యాడు. టి-20 ప్రపంచ కప్లో విరాట్ బ్యాటింగ్ మెరుపులను నెటిజన్లు తెగ ప్రశంసించారు. ఇక సోషల్ మీడియాలో విరాట్ ఆటతీరుతో పాటు అతని ప్రేమాయణం కూడా హాట్ టాపిక్గా మారింది.

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో రెండున్నరేళ్ల బంధాన్ని టి-20 ప్రపంచ కప్నకు ముందు విరాట్ తెగదెంపులు చేసుకున్నాడు. కోహ్లీ చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడం వల్లే వీరి బంధం తెగిపోయిందని వదంతులు షికారు చేశాయి. విరాట్ ఆడుతుంటే స్టేడియంలోని గ్యాలరీలో సందడి చేసే అనుష్క టి-20 ప్రపంచ కప్ సందర్భంగా ఎక్కడా కనిపించలేదు. అయితే గతవారం ఇద్దరూ కలసి మళ్లీ  కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  గత బుధవారం ముంబై బాంద్రాలోని రాయల్టీ క్లబ్‌లో ఈ ఇద్దరూ కలిసి డిన్నర్‌ చేశారు. దీంతో వీరి ప్రేమ మళ్లీ చిగురించిందంటూ బాలీవుడ్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

కాగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ కొత్త ఫొటో బాగా పాపులరయింది. ఆ ఫొటోలో విరాట్ టీ షర్ట్ వేసుకున్నాడు. దానిపై 'వు వర్ ఆన్ ఏ బ్రేక్' అని రాసి ఉంది. అనుష్కతో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు ఇలా టీ షర్ట్ ద్వారా వెల్లడించాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంతకీ అనుష్కతో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నాడా? లేక మళ్లీ కలసిపోయారా అన్నది కోహ్లీకే తెలియాలి!

మరిన్ని వార్తలు