రషీద్‌ ఖాన్‌  మ్యాచ్‌ ఫీజులో కోత 

23 Sep, 2018 01:40 IST|Sakshi

 అస్గర్, హసన్‌ అలీలకూ జరిమానా  

అబుదాబి: ఆసియా కప్‌ సూపర్‌–4 మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీ చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ హసన్‌ అలీతో పాటు అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ అస్గర్, స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌లు లెవల్‌–1 నిబంధనను అతిక్రమించినందుకు గాను వారి మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక్కో డీ మెరిట్‌ పాయింట్‌ను కేటాయించింది.

రషీద్, హసన్‌లకు డీ మెరిట్‌ పాయింట్లు లభించడం ఇదే తొలిసారి కాగా... అస్గర్‌కు రెండోసారి. అతను 24 నెలల వ్యవధిలో మరోసారి నిబంధనలను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్‌ నిషేధం పడనుంది.  
అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్‌ వేస్తున్న పాక్‌ ఆల్‌రౌండర్‌ హసన్‌ అలీ ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మన్‌ హష్మతుల్లా వైపు బంతి విసిరగా... ఆ తర్వాత 37వ ఓవర్‌లో అఫ్గాన్‌ కెప్టెన్‌ అస్గర్‌... బౌలింగ్‌ చేయడానికి వెళ్తున్న హసన్‌ను కావాలనే భుజంతో ఢీకొట్టాడు. ఇక స్పిన్నర్‌ రషీద్‌ పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఆసిఫ్‌ అలీని ఔట్‌ చేశాక అభ్యంతరకరంగా అతన్ని సాగనంపాడు. వీటిపై ఐసీసీ చర్యలు తీసు కుంది. మ్యాచ్‌ అనంతరం ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ తప్పులను అంగీకరించారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోహ్లి.. నీకిది తగదు!

గావస్కర్‌కు మంజ్రేకర్‌ కౌంటర్‌!

యువరాజ్‌ దూకుడు

ఎఫైర్ల వివాదంలో పాక్‌ క్రికెటర్‌ క్షమాపణలు

గేల్‌ మెరుపులు.. ఆకాశంలో ఉరుములు!

‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’

దీపా కర్మాకర్‌ ఇంకా కోలుకోలేదు

సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా

కావ్య, నందినిలకు స్వర్ణాలు

అంతా నాన్సెన్స్‌ : రవిశాస్త్రి

వైదొలిగిన సింధు

16 ఏళ్ల రికార్డు బద్దలు

గట్టెక్కిన పట్నా పైరేట్స్‌

రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన

బెంగాల్‌ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..

టెస్టు చాంపియన్‌షిప్‌పై స్పందించిన కోహ్లి

తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌

అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ

ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..

ఇదేమి సెలక్షన్‌ కమిటీరా నాయనా!

ధోని.. నీ దేశభక్తికి సెల్యూట్‌: విండీస్‌ క్రికెటర్‌

బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో ఆమ్రే..

‘రాయ్‌.. నీ ఆట ఏమిటో చూస్తాం’

కిడ్నాప్‌ చేసి నగ్నంగా బంధించాడు!

కోహ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌పై బీసీసీఐ స్పష్టత

‘బౌండరీ రూల్‌’ మారుతుందా?

టీ20ల్లో సరికొత్త రికార్డు

మొమోటా సిక్సర్‌...

మనీషా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

ఓవరాల్‌ చాంపియన్‌ ప్రీతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’

శంకర్‌ దర్శకత్వంలో ఆ ఇద్దరు

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?