ఆమ్లా అరుదైన ఘనత

13 Jan, 2018 19:58 IST|Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా సీనియర్‌ క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. సెంచూరియన్‌లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆమ్లా ఈ ఘనతను సాధించాడు.  తద్వారా ఇప్పటివరకూ జాక్వస్‌ కల్లిస్‌ పేరిట (1267) రికార్డును ఆమ్లా సవరించాడు.  ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆమ్లా 65 వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా కల్లిస్‌ రికార్డును బద్దలు కొట్టాడు. సెంచూరియన్‌లో 12 టెస్టు మ్యాచ్‌లో ఆడిన ఆమ్లా ఈ ఫీట్‌ సాధించగా, కల్లిస్‌ 16 టెస్టుల్లో ఆడాల్సి వచ్చింది. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్‌(1177) మూడో స్థానంలో ఉన్నాడు.


రెండో టెస్టులో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు ఎల్గర్‌(31), మర్‌క్రామ్‌(94)లు శుభారంభం అందించారు. అటు తరువాత ఆమ్లా హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సఫారీల తొలి ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. సఫారీలు కోల్పోయిన మూడు వికెట్లలో రెండు అశ్విన్‌ సాధించగా, ఒక వికెట్‌ ఇషాంత్‌కు లభించింది.


 

మరిన్ని వార్తలు