ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్‌

15 Aug, 2019 16:33 IST|Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆరంభమైన రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ప్రారంభంలోనే ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ వికెట్‌ను కోల్పోయింది.. హజల్‌వుడ్‌ బౌలింగ్‌లో రాయ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో స్కోరు బోర్డుపై పరుగులేమీ చేయకుండానే ఇంగ్లండ్‌ వికెట్‌ను నష్టపోయింది. మూడు బంతులు మాత్రమే ఆడిన రాయ్‌..పైనీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఆపై కాసేపటకి వన్‌ డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ జో రూట్‌(14) కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. హజల్‌వుడ్‌ బౌలింగ్‌లోనే వికెట్లు ముందు దొరికిపోయాడు. దాంతో ఇంగ్లండ్‌ 26 పరుగులకే రెండో వికెట్లు కోల్పోయింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దు కావడంతో రెండో రోజు టాస్‌ వేశారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది.  టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైనీ తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ​ కొనసాగిస్తోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక  సిరీస్‌ తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు