సహస్రారెడ్డి సెంచరీ వృథా

20 Nov, 2019 08:48 IST|Sakshi

పోరాడి ఓడిన విశాక సీసీ

16 పరుగులతో రోహిత్‌ ఎలెవన్‌ గెలుపు

హెచ్‌సీఏ రెండు రోజుల లీగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: విశాక బ్యాట్స్‌మన్‌ సహస్రా రెడ్డి (147 బంతుల్లో 103; 17 ఫోర్లు) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ సహచరులు విఫలమవ్వడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. బౌలింగ్‌లో నదీమ్‌ (5/57) చెలరేగడంతో హెచ్‌సీఏ ఎ–2 డివిజన్‌ రెండు రోజుల క్రికెట్‌ లీగ్‌లో భాగంగా రోహిత్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశాక సీసీ 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆట రెండోరోజు మంగళవారం 214 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన విశాక సీసీ 59.1 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. సహస్రా రెడ్డి కీలక సెంచరీ సాధించగా, సాయి విహారి (41; 9 ఫోర్లు) రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవ్వడంతో విశాక జట్టు పరాజయం పాలైంది. అంతకుముందు రోహిత్‌ ఎలెవన్‌ 61.1 ఓవర్లలో 213 పరుగులు చేసింది.  

అపెక్స్‌ సీసీతో మంగళవారం మొదలైన మరో మ్యాచ్‌లో విజయ్‌ హనుమాన్‌ సీసీ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన విజయ్‌ హనుమాన్‌ 51.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రాజశేఖర్‌ (62; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. సాహిల్‌ (37) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ రెడ్డి 4 వికెట్లు, వినీత్‌ 5 వికెట్లతో ప్రత్యరి్థని కట్టడి చేశారు.  

సలీమ్‌ పాషా హ్యాట్రిక్‌.. స్పోర్టివ్‌ సీసీ విజయం
హెచ్‌సీఏ ఎ–2 డివిజన్‌ రెండు రోజుల లీగ్‌లో స్పోర్టివ్‌ సీసీ బౌలర్‌ సలీమ్‌ పాషా (6/58) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ‘హ్యాట్రిక్‌’తో సహా ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో మంగళవారం హైదరాబాద్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పోర్టివ్‌ సీసీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ టైటాన్స్‌ 69 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఎస్‌. రోహిత్‌ రెడ్డి (76; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, జైనాథ్‌ మాన్‌సింగ్‌ (49; 9 ఫోర్లు) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో సలీమ్‌ పాషా 6 వికెట్లతో చెలరేగాడు. అనంతరం స్పోరి్టవ్‌ సీసీ 47.1 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసి గెలుపొందింది. స్వామి నాయుడు (34) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో సాకేత్‌ 3...  నరేందర్‌ గౌడ్, రోహిత్‌ రెడ్డి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. 

మరిన్ని వార్తలు