‘నా అధ్యక్షతన తొలి క్రికెట్‌ మ్యాచ్‌ ఇది’

28 Nov, 2019 14:21 IST|Sakshi

హైదరాబాద్‌:  వచ్చే నెలలో వెస్టిండీస్‌తో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరుగనుంది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం భారత్‌-వెస్టిండీస్‌ల తొలి టీ20 ముంబైలో డిసెంబర్‌ 6వ తేదీన జరగాల్సి ఉండగా, ఆ మ్యాచ్‌ను హైదరాబాద్‌కు మార్చారు. అయితే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మహ్మద్‌ అజహరుద్దీన్‌ విజ్ఞప్తి మేరకు తొలి మ్యాచ్‌ను నగరంలో నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గుచూపిందట. ఈ విషయాన్ని అజహర్‌ స్వయంగా తెలియజేశాడు.(ఇక్కడ చదవండి: తొలి టీ20 వేదిక మారింది..)

‘హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో డిసెంబర్‌ 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్‌ను హెచ్‌సీఏ రిక్వస్ట్‌ మేరకు 6వ తేదీనే నిర్వహిస్తున్నాం​. విండీస్‌తో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరుగనుంది. ఇది హెచ్‌సీఏలో నా అధ్యక్షతను మొదటి మ్యాచ్‌. క్రికెట్‌ అనేది ప్రతిరోజూ నేర్చుకునే గేమ్‌. క్రికెట్‌ అభిమానులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్‌ సెక్యూరిటితో పాటు ప్రైవేట్‌ సెక్యురిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపటి నుంచి మ్యాచ్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి’ అని అజహర్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు