హీనాకు రజతం

30 Mar, 2014 01:49 IST|Sakshi
హీనాకు రజతం

ప్రపంచకప్ షూటింగ్
 న్యూఢిల్లీ: భారత స్టార్ ఎయిర్ పిస్టల్ షూటర్ హీనా సిద్ధూ అమెరికాలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించింది. అర్హత రౌండ్‌లో 400కు 386 పాయింట్లు స్కోరు చేసిన ఆమె ఫైనల్లో  200.8 స్కోరు నమోదు చేసి రెండో స్థానాన్ని దక్కించుకుంది.
 
  అంటొనెటా బెనోవా (బల్గేరియా-203.6 పాయింట్లు) స్వర్ణం... జొరానా అరునోవిక్ (సెర్బియా-180.9 పాయింట్లు) కాంస్యం సాధించారు. హీనాకు వరుసగా ఇది మూడో అంతర్జాతీయ పతకం కావడం విశేషం. గత నెలలోనే కువైట్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో హీనా స్వర్ణం సాధించింది. దీంతో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న హీనా టాప్ ర్యాంకుకు చేరువైంది.  
 

మరిన్ని వార్తలు