యోషిదా చేజారిన స్వర్ణం

20 Aug, 2016 02:10 IST|Sakshi
యోషిదా చేజారిన స్వర్ణం

మహిళల రెజ్లింగ్ 55 కేజీల విభాగంలో సంచలనం నమోదయింది. ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్, జపాన్ రెజ్లర్ సవోరీ యోషిదా శుక్రవారం జరిగిన ఫైనల్లో  అమెరికా రెజ్లర్ హెలెన్ చేతిలో 1-4తో ఓటమిపాలైంది. 13 సార్లు ప్రపంచ చాంపియన్ అయిన యోషిదా.. తొలి రౌండ్లో 1-0తో ఆధిక్యాన్ని కనబరిచింది. అయితే రెండో రౌండ్‌లో పుంజుకున్న మరౌలిస్ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా విజయం సాధించింది.

 

 అర్జెంటీనాకే హాకీ కిరీటం
పురుషుల హాకీ టైటిల్‌ను అర్జెంటీనా తొలిసారి గెలుచుకుంది. బెల్జియంతో జరిగిన ఫైనల్లో 4-2తో విజయం సాధించింది. ఇప్పటివరకు అర్జెంటీనా మహిళలు నాలుగుసార్లు ఒలింపిక్స్ స్వర్ణం గెలవగా.. పురుషుల జట్టుకు ఇదే తొలి స్వర్ణం. కాగా కాంస్యం కోసం జరిగిన పోరులో జర్మనీ జట్టు నెదర్లాండ్స్‌పై గెలిచింది.

 
హర్డిల్స్‌లో అమెరికా హవా కొనసాగింది. పురుషుల 400 మీ(47.73 సె), మహిళ 400 మీ (53.13 సె) అమెరికా స్వర్ణం సాధించింది. అటు, ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి ఇరానియన్ మహిళగా కిమియా అలీజాదే (57 కేజీల తైక్వాండో)నిలిచింది. పురుషుల డెకాథ్లాన్‌లో డిఫెండింగ్ చాంపియన్ (అమెరికా) ఆష్టన్ ఈటన్ టైటిల్ గెలిచాడు. అటు షాట్‌పుట్‌లోనూ ఒలింపిక్ రికార్డుతో (22.52 మీటర్లు) అమెరికన్ ర్యాన్ క్రౌసర్ స్వర్ణం గెలుచుకున్నాడు.

>
మరిన్ని వార్తలు