హెలికాప్టర్లతో అవుట్‌ ఫీల్డ్‌ రెడీ చేశారు...

22 Mar, 2018 12:03 IST|Sakshi

లాహోర్‌: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.. ఏ చిన్న కారణంతోనైనా మ్యాచ్‌ జరగపోతే ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ నాకౌట్‌ మ్యాచ్‌లంటే మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానంగా వర్షం వెలిసిన తర్వాత అవుట్‌ ఫీల్డ్‌ను సిద్ధం చేయడంలో క్రికెట్‌ బోర్డులో సరైన చర్యలు తీసుకోలేకపోతే విమర్శలు వర్షం కురుస్తోంది. ఇలా చేయాలంటే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా తమవద్ద ఉన్న వనరులను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) సద్వినియోగం చేసుకుని మ్యాచ్‌ సజావుగా జరిగేలా చేసిన ఘటన పీఎఎస్‌ఎల్‌ చోటు చేసుకుంది. అందుకు హెలీకాప్టర్లను సైతం ఉయోగించుకుని శభాష్‌ అనిపించింది.

 బుధవారం పెషావర్‌ జల్మీ-కరాచీ కింగ్స్‌ జట్ల మధ్య ఎలిమినేటర్‌-2 మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌కు ముందు వర్షం పడటంతో అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. దాంతో సాధ్యమైనన్ని ఓవర్ల పాటు మ్యాచ్‌ను జరిపించాలని భావించిన పీసీబీ పెద్దలు ఉన్నపళంగా రెండు హెలికాప్టర్లను తెప్పించారు. వాటి సాయంతో అవుట్‌ ఫీల్డ్‌ను ఆరబెట్టారు.  ఇది నాకౌట్‌ మ్యాచ్‌ కావడంతో హెలికాప్టర్లతో పిచ్‌ను సిద్ధం చేయడం ఒక్కటే మార‍్గమని తలచిన పీసీబీ.. ఆ మేరకు చర్యలు తీసుకుని సక్సెస్‌ అయ్యారు.  ఆ క్రమంలోనే 16 ఓవర్ల పాటు మ్యాచ్‌ జరపడానికి అంపైర్లు గ్రీన్‌ సిగ‍్నల్‌ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో పెషావర్‌ జల్మీ 13 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

మరిన్ని వార్తలు