ఇంగ్లండ్‌ రికార్డు ఛేదన

22 Feb, 2019 03:06 IST|Sakshi

 బ్రిడ్జ్‌టౌన్‌: ఇంగ్లండ్‌ విజయ లక్ష్యం 361 పరుగులు... ఛేదనలో ఇంత భారీ స్కోరు సాధించడం దాదాపుగా అసాధ్యం అనిపించిన చోట మోర్గాన్‌ సేన సత్తా చాటింది. రాబోయే వరల్డ్‌ కప్‌లో అసలైన ఫేవరెట్‌గా కనిపిస్తున్న ఆ జట్టు మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి తన పదును చూపించింది. బుధవారం రాత్రి జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా విండీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (129 బంతుల్లో 135; 3 ఫోర్లు, 15 సిక్సర్లు), షై హోప్‌ (65 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడారు. అనంతరం ఇంగ్లండ్‌ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 364 పరుగులు సాధించింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జేసన్‌ రాయ్‌ (85 బంతుల్లో 123; 15 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్‌ (97 బంతుల్లో 102; 9 ఫోర్లు) సెంచరీలు సాధించి తమ జట్టును గెలిపించారు. రాయ్‌ జోరు ముందు గేల్‌ చేసిన శతకం మసకబారిపోయింది. సునాయాస క్యాచ్‌ వదిలేసి గేల్‌ సెంచరీకి కారణమైన రాయ్‌ బ్యాటింగ్‌తో తన తప్పు దిద్దుకున్నాడు. ముందుగా రాయ్, బెయిర్‌ స్టో (34) తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో 91 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు శుభారంభం అందించారు. ఆ తర్వాత రూట్‌... రెండో వికెట్‌కు రాయ్‌తో 114 పరుగులు, మూడో వికెట్‌కు మోర్గాన్‌ (51 బంతుల్లో 65; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)తో 116 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో రూట్‌ వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఇంగ్లండ్‌ ఆటగాడిగా నిలిచాడు. రాయ్, రూట్‌ ఇచ్చిన చెరో రెండు క్యాచ్‌లు వదిలేసిన విండీస్‌ ఫీల్డర్లు ప్రత్యర్థికి తమ వంతు సాయం అందించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1–0తో ఆధిక్యంలో నిలవగా, నేడు ఇదే మైదానంలో రెండో వన్డే జరుగుతుంది.

► 1తమ వన్డే చరిత్రలో ఇంగ్లండ్‌ ఛేదించిన అత్యధిక స్కోరు ఇదే. ఓవరాల్‌గా ఇదే మూడో అత్యుత్తమ ఛేదన. దక్షిణాఫ్రికా రెండు సార్లు (438/9 – 372/6) ఆసీస్‌పైనే ఇంతకంటే పెద్ద లక్ష్యాలను అధిగమించింది.

► 23వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో సిక్సర్ల సంఖ్య. గతంలో న్యూజిలాండ్‌ (22) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును విండీస్‌ అధిగమించింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘డాడీ ఆర్మీ’ అన్నారు కదా.. ఏమైంది?

ఆ రెండు జట్లే వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌: మెక్‌గ్రాత్‌

25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు..

రాష్ట్ర త్రోబాల్‌ జట్టులో సమీనా, మాథ్యూ

భారత స్పీడ్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా రఘు

చాంప్స్‌ అక్షయ, పవన్‌ కార్తికేయ

అజయ్, మిథున్‌ పరాజయం

భారత్‌ ఖేల్‌ ఖతం 

మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌ 

పుల్వామా బాధిత కుటుంబాలకు సీఎస్‌కే విరాళం 

మూడో సారి ‘సూపర్‌’ 

‘రైజింగ్‌’కు రెడీ

రోహిత్‌ ‘ఫోర్‌’ కొడతాడా! 

ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తున్నాం!

ఐపీఎల్‌ విజేతలు వీరే..

దురదృష్టమంటే నీదే నాయనా?

దానికి సమాధానం కోహ్లి దగ్గరే!

కార్పొరేట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ షురూ

తెలంగాణ త్రోబాల్‌ జట్ల ప్రకటన

వార్నర్‌కు సరితూగలేరెవ్వరూ...

ఇండియా ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్‌ 

భారత్‌కు చుక్కెదురు 

టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ ఆవిష్కరణ 

ఎదురులేని భారత్‌

ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, మిథున్‌

ఉత్కం‘టై’న మ్యాచ్‌లో సఫారీ ‘సూపర్‌’ విక్టరీ 

ఆ సంగతి ఆటగాళ్లకు బాగా తెలుసు 

ముంబై ముచ్చటగా...

అంతా ధోనిమయం!

మూడో టైటిల్‌ వేటలో...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చచ్చిపోవాలనుకున్నా; నటి భావోద్వేగం

సూపర్‌ హిట్ రీమేక్‌పై క్లారిటీ

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో